సింగరేణి ఆర్జించిన లాభాల్లో 17 శాతం వాటా ప్రకటన
2011-2012 ఆర్ధిక సంవత్సరం లో సింగరేణి సంస్థ ఆర్జించిన 519 కోట్ల లో కార్మ్కకు లకు 25 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొదటి నుండి కోరుతోంది. ఈవిషయం పై గత రెండు నెలలుగా 5 సార్లు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరకు విసుగు చెందినా మా గౌరవ అధ్యక్షులు, చెన్నూరు శాసన సభ్యులు శ్రీ నల్లాల ఓదెలు నిన్నటి నుండి మందమర్రి జి యం ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దేక్షకు కూర్చోవడం జరిగింది. ఆయనకు సంఘీభావంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు కొనసాగించారు. చివరకు ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వం 17 శాతం వాటాను ప్రకటించింది. ఇది కూడా దసరా పండగకి ముందే అందించాలని సింగరేణి భావిస్తోంది. ఇది సింగరేణి కార్మికుల విజయంగానే టి.బి.జి.కే.ఎస్. ప్రకటించింది. ఇక ముందు కూడా కార్మికుల సమస్యలపై పోరాడేందుకు టి.బి.జి.కే.ఎస్. ఎల్లప్పుడూ ముందుంటుంది. సింగరేణి కార్మికులకు ఎ విధమైన సమస్య వచ్చినా అక్కడ టి.బి.జి.కే.ఎస్. కార్యకర్తలు ముందు ఉంటారు.